పచ్చిమిరప కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని బాగా కడిగి క్లాత్ పై వేసి ఆరబెట్టాలి. తేమవల్లే ఇవి తొందరగా పాడవుతాయి.
పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటి తొడిమెలను తీసేయాలి. దీనివల్ల అవి త్వరగా పాడవవు.
పచ్చిమిరపకాయల్ని గాలి వెల్లని డబ్బాలో వేయడానికి ముందు అందులో టిస్యూ పేపర్ ను పెట్టండి.
పచ్చిమిరపకాయల్ని గాజు డబ్బాలో నిల్వ చేయడం మంచిది. ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే తొందరగా పాడవుతాయి.
పచ్చిమిర్చి డబ్బాను ఫ్రిజ్ లోని కూరగాయల డ్రాయర్ లో పెట్టాలి. ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా, చల్లగా ఉంటుంది. దీంతో మిరపకాయలు పాడవవు.
ఆవనూనెలో ముంచి పచ్చిమిరపకాయల్ని నిల్వ చేస్తే అవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయని చాలా మంది నమ్ముతారు. దీనివల్ల మిరపకాయలు డిఫరెంట్ టేస్ట్ అవుతాయి.
ఇడ్లీ, దోశ పిండి పుల్లగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
నానపెట్టిన ఖర్జూర పండ్లు తింటే ఏమౌతుంది?
నెయ్యి స్వచ్ఛంగా ఉందో లేదో తెలుసుకునేదెలా?
మిరియాలు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?