టమాటాలను సాస్ లేదా కెచప్ చేసి నిల్వ చేయొచ్చు. ఇందుకోసం టమాటాలను ఉడకబెట్టి రుబ్బుకుని ఉప్పు, చక్కెర, వెనిగర్ వేసి చిక్కగా చేయాలి. సీసాలో నిల్వ చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది.
బాగా పండిన టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి నాలుగైదు రోజులు ఎండలో బాగా ఎండబెట్టండి. ఎండిన టమాటా ముక్కలను గాలి వెల్లని డబ్బాలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడండి.
టమాటాలను ఉడకబెరట్టి మెత్తగా రుబ్బుకోండి. దీన్ని చిన్న కంటైనర్లలో లేదా ఐస్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేయండి. ఇవి కడ్డకట్టిన తర్వాత జిప్ లాక్ బ్యాగ్ లో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడండి.
టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని కడిగి ఆరబెట్టి ప్లాస్టిక్ బ్యాగ్‌లో నింపి ఫ్రీజర్‌లో ఉంచండి. వీటిని అవసరమైనప్పుడు తీసి వాడండి.
టమాటా ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం వీటిని ముక్కలు చేసి మసాలాలు కలిపి ఊరగాయ పెట్టండి. దీన్ని గాజు సీసాలో నిల్వ చేస్తే నెలల తరబడి నిల్వ ఉంటుంది.
ఇందుకోసం టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆలివ్ ఆయిల్ లో వేయండి. దీనిలో వెల్లుల్లి, మసాలాలు వేసి నిల్వ చేస్తే సరి. చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. పాస్తా-శాండ్‌విచ్‌లో తినొచ్చు.