Food
రోగనిరోధక శక్తిని పెంచితే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉండగలుగుతాం. మరి రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఏం తినాలంటే?
ఉసిరికాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఉసిరి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతోబాగా సహాయపడతాయి.
నట్స్ లో విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ఎండాకాలంలో మజ్జిగను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మజ్జిగను తాగడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు మన రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. సీజనల్ వ్యాధులను నివారించడంలో అల్లం బాగా సహాయపడుతుంది.
వెల్లుల్లి ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.