ఎన్నో ఔషధ గుణాలున్న పసుపు మన మూత్రపిండాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. పాలలో పసుపును కలుపుకుని తాగడం మంచిది.
food-life Feb 17 2024
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
ఎర్ర క్యాప్సికమ్
రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెడ్ క్యాప్సికమ్ కూడా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీన్ని మరీ ఎక్కువగా వండకుండా తినాలి.
Image credits: Getty
Telugu
ఉసిరికాయ
ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇది మన మూత్రపిండాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
వెల్లుల్లి
వెల్లుల్లి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా.. మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
కొబ్బరి నీరు
కొబ్బరి నీరు మన శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. అలాగే నిర్జలీకరణం బారిన పడకుండా చేస్తుంది. ఇవన్నీ మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
అల్లం
మూత్రపిండాల సమస్యలను తగ్గించే గుణం అల్లానికి ఉంది. కాబట్టి అల్లం టీ వంటి పానీయాలు తాగితే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
కీరదోసకాయ
కీరదోసకాయ నిర్జలీకరణాన్ని నివారించడానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అందుకే ఇది కూడా మూత్రపిండాలకు మేలు చేస్తుంది.