Idli: రోజూ ఇడ్లీలు తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?
food-life May 21 2026
Author: ramya Sridhar Image Credits:Gemini AI
Telugu
రోజూ ఇడ్లీ తింటున్నారా?
చాలా మంది రోజూ ఇడ్లీ తింటారు. కానీ, ఇడ్లీను అతిగా తినడం అసలు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
Image credits: gemini
Telugu
ఎక్కువగా తినడం మంచిది కాదు
ఇడ్లీలు ఎక్కువగా తినడం వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే, వీటిని ఎక్కువగా తినకూడదు.
Image credits: Getty
Telugu
డయాబెటిస్ ఉన్నవాళ్లు
డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీలను ఎక్కువగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, వీటిని అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించని విధంగా పెరిగిపోతాయి.
Image credits: Freepik
Telugu
బరువు పెరగడం
ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, కార్బోహైడ్రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు ఇడ్లీలు ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
Image credits: Social Media
Telugu
గ్యాస్ట్రిక్ సమస్య
ఇడ్లీ పిండిని పులియబెట్టి తయారు చేస్తారు. కాబట్టి, ఇలా తయారు చేసిన ఇడ్లీలను మీరు ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.