Food
కారెట్‌లో ల్యూటిన్, లైకోపీన్ బాగా ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
క్యారెట్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్యారెట్‌లోని పీచు పదార్థాలు జీర్ణక్రియకు చాలా మంచిది. మలబద్ధకం రాకుండా చేస్తుంది.
ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని కాపాడుతుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
పొటాషియం ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.
క్యారెట్‌లోని కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్.
క్యారెట్ ఎక్కువగా తినే ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
చర్మం మెరిసేలా చేస్తుంది. ఎండ వేడి నుంచి కూడా కాపాడుతుంది.