గుండె సమస్యల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మనదేశంలో మరణిస్తున్నవారిలో దాదాపు 27 శాతం గుండె వ్యాధుల వల్లే మరణిస్తున్నట్టు WHO చెబుతోంది.
గుండెలో రక్త ప్రవాహానికి అడ్డంకులు వస్తే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. ఏం తినడం ద్వారా బ్లాకేజీలు రాకుండా అడ్డుకోవచ్చో తెలుసుకోండి.
బీట్‌రూట్‌లో డైటరీ నైట్రేట్లు అధికంగా ఉంటాయి. శరీరం దీన్ని నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుంది. ఇది గుండెను కాపాడుతుంది.
వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండెలో బ్లాకేజీని అడ్డుకుంటుంది.
సాల్మన్ చేపలో లాంగ్ చైన్ ఒమేగా 3 ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను, రక్తనాళాల వాపును తగ్గిస్తాయి.
డార్క్ చాక్లెట్ చిన్న ముక్క తింటే మంచిది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి గుండెకు రక్షణ కల్పిస్తాయి.
నారింజలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి నారింజ తినాలి.
త్వరగా నిద్రపట్టాలంటే ప్రతిరోజూ వీటిని తినండి
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు!
పచ్చి ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?
ఈ ఫుడ్స్ లోనూ మైదా ఉంటుంది జాగ్రత్త..!