Telugu

Leftover Idli: ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసేయండి

Telugu

ఇడ్లీ మిగిలిపోయాయా?

ఉదయం చేసిన ఇడ్లీలు మిగిలిపోయాయా? అయితే.. కేవలం ఉప్పు, కారం, మసాలాతో స్పైసీ టచ్ ఇస్తే టేస్టీ స్నాక్ తయారైనట్లే..

Image credits: instagram
Telugu

మసాలా ఇడ్లీ కి కావాల్సినవి...

ఇడ్లీలు: 4, కారం: 1/2 టీస్పూన్, జీలకర్ర-ఆవాలు: 1/2 టీస్పూన్, పసుపు: చిటికెడు, గరం మసాలా: 1/2 టీస్పూన్, కరివేపాకు: 4 రెబ్బలు, వెల్లుల్లి: 5-6 రెబ్బలు, నూనె, ఉప్పు: రుచికి సరిపడా.

Image credits: instagram
Telugu

మసాలా ఇడ్లీ తయారీ విధానం

ముందుగా, ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ఇడ్లీని 4 నుంచి 6 ముక్కలుగా కట్ చేయాలి.

Image credits: instagram
Telugu

తాలింపు ఇలా..

స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేయండి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి.

Image credits: AI Generated
Telugu

ఇప్పుడు ఇడ్లీ ముక్కలు

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఆ తర్వాత, కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను వేసి కలపాలి.

Image credits: Pinterest
Telugu

మ్యాగీ మసాలాతో అదనపు రుచి

ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, బాగా వేడి చేయండి. చివరగా, పిల్లలు ఇష్టపడితే కొద్దిగా మ్యాగీ మసాలా లేదా నిమ్మరసం కూడా కలపవచ్చు.

Image credits: instagram

Idli:పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక స్పూన్ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి

Sambar Recipe: ఈ ఒక్క పొడి వేస్తే.. సాంబార్‍ టేస్ట్ అదిరిపోద్ది

Dosa: మినపప్పు, అటుకులు లేకుండా కేవలం ఈ ఒక్కదాంతో మెత్తటి దోశలు రెడీ!

Kiwi Fruit: కివీ పండు తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!