Sambar Recipe: ఈ ఒక్క పొడి వేస్తే.. సాంబార్ టేస్ట్ అదిరిపోద్ది
food-life Apr 11 2026
Author: Nandini Arava Image Credits:Pinterest
Telugu
ఈ ఒక్కటి వేస్తే చాలు.. అన్నం, సాంబార్‌తో లాగించేస్తారు
ఎంత బాగా చేసిన సాంబార్ రుచిగా రావడం లేదా? అయితే మీరు కచ్చితంగా ఈ చిన్న మ్యాజిక్ మిస్ చేస్తున్నారు. ఇది గానీ పాటిస్తే సాంబార్ రుచి అదిరిపోతుంది. నోట్లో నీళ్లు రావాల్సిందే..
Image credits: AI Image
Telugu
కూరగాయలు, పప్పు ఉడికించాలి
ముందుగా, కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, కందిపప్పులో కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి.
Image credits: instagram
Telugu
మసాలా వేయించుకోవాలి
ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలతో పాటు కొబ్బరి తురుమును కూడా వేయించి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఒక పద్ధతి.
Image credits: AI Image
Telugu
ఎండుమిర్చి మంచివి వాడాలి
సాంబార్ రుచిలో ఎండు మిరపకాయలది కీలక పాత్ర. వంటకు వాడే ఎండుమిర్చి నాణ్యంగా ఉంటే సాంబార్ రుచి రెట్టింపు అవుతుంది.
Image credits: instagram
Telugu
పచ్చి మసాలాతో మరో రుచి
మసాలా దినుసులను వేయించి మిక్సీలో రుబ్బితే ఒక రకమైన రుచి వస్తుంది. వాటిని వేయించకుండా పచ్చిగానే రుబ్బితే మరో అద్భుతమైన రుచి వస్తుంది.
Image credits: instagram
Telugu
వేయించకుండా ప్రయత్నించండి
ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, పసుపు పొడిని వేయించకుండా.. పచ్చిగానే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈసారి ఇలా ట్రై చేయండి.
Image credits: instagram
Telugu
నెయ్యితో తాలింపు పెట్టండి
తాలింపు పెట్టేటప్పుడు మినపప్పు, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేయాలి. దీనికి కొబ్బరి నూనె లేదా నెయ్యి వేస్తే రుచి అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
ఉప్పు, పులుపు, కారం
సాంబార్లో ఉప్పు, పులుపు, కారం సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి. అవసరమైతే, అర చెంచా బెల్లం వేస్తే సాంబార్ రుచి మరింత పెరుగుతుంది.