Telugu

Idli:పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక స్పూన్ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి

Telugu

ఇడ్లీకి కావాల్సినవి ఇవే...

1కప్పు మినపప్పు, 3 కప్పుల ఇడ్లీ బియ్యం తో పాటు..  మినపప్పు నానపెట్టినప్పుడు అందులో 1 స్పూన్ మెంతులు, రవ్వ, రుచికి సరిపడా ఉప్పు ఉంటే చాలు. 

Image credits: Getty
Telugu

నానబెట్టేటప్పుడు ఈ ట్రిక్

మినపప్పు నానబెట్టేటప్పుడు, అందులో ఒక చెంచా మెంతులు వేయండి. ఇది ఇడ్లీలు మెత్తగా రావడానికి, పిండి బాగా పులియడానికి (Fermentation) సహాయపడుతుంది.

Image credits: our own
Telugu

పిండి రుబ్బే విధానం

మినపప్పును నునుపుగా, మెత్తగా అయ్యేంతవరకు రుబ్బాలి. బియ్యాన్ని మాత్రం రవ్వలా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.

Image credits: Istock
Telugu

పిండి పులియబెట్టడం

రుబ్బిన పిండిని కనీసం 8-10 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచండి. ఇడ్లీలు వేసే ముందు మాత్రమే ఉప్పు కలపాలి.

Image credits: instagram
Telugu

ఉడికించే పద్ధతి

మీడియం మంట మీద కేవలం 10-12 నిమిషాలు ఉడికించండి. ఎక్కువ సేపు ఉడికిస్తే ఇడ్లీలు గట్టిగా అవుతాయి. సరైన కొలతలు, పిండి సరిగ్గా పులిస్తేనే ఇడ్లీలు దూదిలా మెత్తగా వస్తాయి.

Image credits: Pinterest

Sambar Recipe: ఈ ఒక్క పొడి వేస్తే.. సాంబార్‍ టేస్ట్ అదిరిపోద్ది

Dosa: మినపప్పు, అటుకులు లేకుండా కేవలం ఈ ఒక్కదాంతో మెత్తటి దోశలు రెడీ!

Kiwi Fruit: కివీ పండు తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Kitchen Hack: బెండకాయ కట్ చేసినా చేతులకు జిగురు అంటకూడదా? ఈ టిప్ మీకే