Food
ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి ప్రస్తుతం సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది.
జీవనశైలిలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్లే క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ రాకుండా ఉండటానికి కొన్ని ఆహారాలు ఎంతగానో సహాయపడతాయి. అవేంటంటే?
సిట్రస్ పండ్లు విటమిన్ సి కి అద్బుతమైన మూలం. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తింటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఆపిల్ పండ్లలోని పాలీఫెనాల్స్ ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యారెట్లలో విటమిన్ కె, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్యూనా చేపలను తినండి.