ఈ రోజుల్లో పిజ్జా నుంచి టోస్ట్ వరకు అన్నింట్లోనూ చీజ్ వాడుతున్నారు. మరి, ఈ చీజ్ ని ఇంట్లోనే సింపుల్ గా ,చాలా తక్కువ సమయంలోనే తయారు చేయవచ్చు.
పాలతో పనీర్ ఎలా తయారు చేస్తారో, అలాగే చీజ్ కూడా చేయొచ్చు. చీజ్ చేయడానికి మీకు రెండు రహస్య పదార్థాలు అవసరం. అవే వైట్ వెనిగర్, ఈనో.
పాలను కొద్దిగా వేడి చేయండి, మరగబెట్టకూడదు. కొద్దిగా పొంగు రాగానే గ్యాస్ ఆపేయండి. ఒక గిన్నెలో కొంచెం వైట్ వెనిగర్ తీసుకుని, దానికి నీళ్లు కలిపి నెమ్మదిగా పాలలో వేయండి.
వెనిగర్ కలిపిన తర్వాత, నీళ్లు, పనీర్ నెమ్మదిగా వేరవుతాయి. ఇప్పుడు ఒక కాటన్ గుడ్డలో పనీర్‌ను వేరు చేసి, వెనిగర్ రుచి పోవడానికి నీటితో కడగండి.
పన్నీర్ లాంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకొని అందులో ఈనో వేసి నురగ పోయే వరకు కలిసి పెట్టుకోవాలి.
గ్రైండర్ జార్‌లో పనీర్ వేసి, ఈనో కలిపిన నీళ్లు కలపండి. తర్వాత రెండు చెంచాల నెయ్యి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బ్లెండ్ చేయండి. చీజ్ రెడీ అయినట్లే.
చీజ్ నిల్వ చేయడానికి, ఒక బాక్స్‌లో బట్టర్ పేపర్ పెట్టి నెయ్యి రాసి, అందులో చీజ్ వేయండి. పైన ప్లాస్టిక్ కవర్ పెట్టి, 2-3 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.