Food
చియా సీడ్స్ లో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
చియా సీడ్స్ ని రెగ్యులర్ గా డైట్ లో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చియా సీడ్స్ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎక్కువగా తీసుకుంటే అంతే నష్టాలు కూడా ఉన్నాయి.
చియాసీడ్స్ సాధారణంగా జీర్ణ సమస్యలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కానీ కొందరికి మాత్రం జీర్ణ సమ్యలు తెచ్చిపెడతాయి.
చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డయేరియా, గ్యాస్, కడుపులో నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దురద, స్వెల్లింగ్, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు.
చియా సీడ్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి.. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే,క్యాలరీలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది.