అన్నం, కూర, బ్రెడ్ లను ఫ్రిజ్ లో ఎన్ని రోజులు పెట్టొచ్చు
Telugu
మిగిలిన వాటిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా?
చాలా మంది మిగిలిన ఫుడ్ ను ఫ్రిజ్ లో పెట్టేసి మరుసటి రోజు ఆ తర్వాతి రోజు ఇలా తింటుంటారు. కానీ ఇలా తింటే ఏమౌతుందో తెలుసా?
Telugu
సురక్షితం కాదా?
మిగిలిపోయిన అన్నం, రోటీ, పప్పు లేదా కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టి చాలా రోజులు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది.
Telugu
ఫ్రిజ్‌లో బ్యాక్టీరియా
వండని, వండిన ఆహారాలను కలిపి ఫ్రిజ్ లో పెడితే దాంట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల వండిన ఫుడ్ పాడవుతుంది. అందుకే ఫ్రిజ్ లో ఫుడ్ ను ఎక్కువ రోజులు పెట్టకూడదు.
Telugu
అన్నాన్ని ఇన్ని రోజులు ఫ్రిజ్‌లో ఉంచాలి
అన్నాన్ని అప్పటికప్పుడు వండుకుని తినడమే ఆరోగ్యానికి మంచిది. కానీ మీరు ఫ్రిజ్ లో వండిన అన్నాన్ని రెండు రోజులకు మించి ఉంచకూడదు.
Telugu
రోటీ
రొట్టెలను, చపాతీలను ఫ్రిజ్ లో పెట్టే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. కానీ వీటిని ఫ్రిజ్‌లో 2-3 రోజులే ఉంచాలి. లేదంటే వాటిపై బూజు లేదా బ్యాక్టీరియా పెరుగుతుంది.
Telugu
కూర
కూరలను మీరు ఫ్రిజ్ లో పెట్టొచ్చు. కానీ వీటిని రెండు రోజులు మాత్రమే ఉంచాలి. ఇంతకు మించి ఉంచితే వాటిలో పోషకాలు నశిస్తాయి. మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
Telugu
పప్పు
పప్పును ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో పెట్టిన పప్పును రెండు రోజుల్లోనే తినేయండి. లేదంటే పాడేయండి. కానీ ఎక్కువ రోజు ఫ్రిజ్ లో ఉన్న పప్పును తింటే గ్యాస్ వస్తుంది.