నాటుకోడి ఉడకడానికి చాలా టైమ్ పడుతోంది. మినిమమ్ 2 గంటలు కావాలి. మీ దగ్గర తక్కువే టైం ఉన్నప్పుడు...నాటుకోడి వండుకోవాలంటే ఆలోచిస్తారు. అయ్యో టైం సరిపోదే అని. ఇప్పుడా బెంగ అక్కర్లేదు.
చికెన్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టించి అరగంట పాటు నానబెట్టండి. ఇలా చేసుకుంటే మాంసం వేగంగా ఉడుకుతుంది.
చికెన్ వండేటప్పుడు రెండు చెంచాల పెరుగు లేదా నిమ్మరసం కలపండి. ఇది మాంసాన్ని మరింత మెత్తగా ఉడికేలా చేస్తుంది.
సాధారణ గిన్నెలో వండటం కంటే ప్రెజర్ కుక్కర్ వాడటం బెస్ట్. 3 నుంచి 5 విజిల్స్ వస్తే నాటు కోడి మాంసం చక్కగా ఉడికిపోతుంది. పట్టుకుంటే మెత్తగా ఉంటుంది.
చికెన్ ముక్కలు వీలైనంత చిన్నగా ఉండేలా చూసుకోండి. పెద్ద ముక్కలు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే మసాలాలు కూడా సరిగ్గా పట్టవు.
వంట మధ్యలో నీళ్లు పోయాల్సి వస్తే, కచ్చితంగా వేడి నీళ్లే వాడండి. చల్లటి నీళ్లు పోస్తే మాంసం గట్టిపడి, ఉడకటానికి ఇంకా ఎక్కువ టైమ్ పడుతుంది.
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Sweet potato: రోజుకి ఒక చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా?
Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?
Idli: రోజూ ఇడ్లీలు తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?