Telugu

Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?

Telugu

వాల్ నట్స్ లో పోషకాలు...

వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానపెట్టి తినడం వల్ల ఈ పోషకాలు శరీరానికి అందుతాయి. 

Image credits: Getty
Telugu

సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు

నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్, జింక్ వంటి మినరల్స్‌ను శరీరం సమర్థవంతంగా గ్రహిస్తుంది.

Image credits: Sociall media
Telugu

జీర్ణ సమస్యలకు చెక్

నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది

రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Getty
Telugu

మెదడు పనితీరుకు భలే మేలు

వాల్‌నట్స్ తినడం వల్ల మెదడులో ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుతుంది. న్యూరోడీజనరేటివ్ వ్యాధుల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉంది.

Image credits: Freepik
Telugu

గుండె జబ్బుల ముప్పు దూరం

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్.. శరీరంలో వాపును తగ్గిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image credits: Freepik
Telugu

ఇమ్యూనిటీ పవర్‌ఫుల్

నానబెట్టిన వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

Image credits: Freepik
Telugu

బరువు తగ్గాలనుకుంటే బెస్ట్ ఆప్షన్

వాల్‌నట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్నప్పుడు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు, బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

Image credits: Sociall media

Idli: రోజూ ఇడ్లీలు తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?

Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు

Fruits: బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సిన పండు ఇది