వేయించిన శనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎలా ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వేయించిన శనగలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆకలిని తగ్గించి బరువు తగ్గిస్తాయి.
వేయించిన శనగలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్ డయాబెటిస్ రోగులకు బలాన్నిస్తుంది.
వేయించిన శనగల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
వేయించిన శనగల్లో బ్యూటిరేట్ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడుతుంది.
ఒక పరిశోధన ప్రకారం శనగలు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ల్యూటిన్, ఇతర ఫైటోన్యూట్రియెంట్స్ మెదడుకు బలాన్నిస్తాయి.