Food

రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలా?

Image credits: Getty

విటమిన్ల నిధి

గుడ్డులో రకరకాల పోషకాలుంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి2,విటమిన్ బి12, బయోటిన్, ఫోలేట్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

ప్రోటీన్

గుడ్డు ప్రోటీన్ కు మంచి వనరు. వీటిలో ఉండే ప్రోటీన్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

గుడ్డును తింటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్డులో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులుంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. 

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

గుడ్డు మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే కోలిన్ మెదడును హెల్తీగా ఉంచుతుంది. కాబట్టి రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. 

Image credits: Getty

కళ్ల ఆరోగ్యం

గుడ్లు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో ఉండే ల్యూటిన్, జియాక్సంతిన్ లు మన కళ్లను హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

గుడ్డును తింటే మన ఎముకలు బలంగా, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. గుడ్డులో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి లు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

రోజూ ఒక గుడ్డును తింటే మీరు బరువు కూడా తగ్గుతారు. గుడ్డులో ఉండే ప్రోటీన్లు మీ ఆకలిని తగ్గించి వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతుంది. 

Image credits: Getty

చర్మం, జుట్టు

గుడ్డు మన చర్మానికి, జుట్టుకు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ, సెలీనియం, జింక్, ప్రోటీన్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి.

Image credits: Getty

ఓట్స్ ను రోజూ తినొచ్చా? తింటే ఏమౌతుంది?

కిడ్నీల్లో రాళ్లకు ఈ ఆహారమే కారణం..

వీళ్లు అరటిపండు తినొద్దా?

అన్నానికి బదులు వీటిని తింటే బరువు తగ్గడం పక్కా