Food

ఓట్స్ ను రోజూ తినొచ్చా? తింటే ఏమౌతుంది?

Image credits: Getty

షుగర్ తగ్గుతుంది

డయాబెటీస్ పేషెంట్లకు ఓట్స్ చాలా మంచివి. వీటిలో ఫైబర్, బీటా-గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: Getty

ఆరోగ్యకరమైన గుండె

ఓట్స్ మన గుండెను  ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా సహాయపడుతుంది.ఓట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను హెల్తీగా ఉంచుతుంది. 

Image credits: Getty

బరువును తగ్గిస్తుంది

ఓట్స్ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గించి మీరు ఎక్కువగా తినకుండా చేస్తుంది. అన్నానికి బదులు ఓట్స్ ను తింటే బరువు తగ్గుతారు.

Image credits: Getty

మలబద్ధకం తగ్గుతుంది

ఓట్స్ ను తింటే మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఓట్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty

చర్మాన్ని కాపాడుతుంది

ఓట్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఓట్స్ లో ఉండే యాంటీ  ఇన్ఫ్లమేటరీ,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.

Image credits: Getty

డయాబెటిస్ తగ్గిస్తుంది

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఓట్స్ ను రోజూ తినడం వల్ల మనకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 

Image credits: Getty

ఓట్స్ లోని పోషకాలు

ఓట్స్ లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ వ్యాధిని నియంత్రించడానికి సహాయపడతాయి.

Image credits: Getty

కిడ్నీల్లో రాళ్లకు ఈ ఆహారమే కారణం..

వీళ్లు అరటిపండు తినొద్దా?

అన్నానికి బదులు వీటిని తింటే బరువు తగ్గడం పక్కా

చేపలో ఈ పార్ట్‌ని అస్సలు పడేయకండి