Food
బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి బదులు క్వినోవా తినాలి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఆకలిని తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అన్నానికి మంచి ప్రత్యామ్నాయం రాగులు. ఈ రాగులను మీరు దోశ, చపాతీ, రాగి జావా అంటూ ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. కానీ ఇది మిమ్మల్ని హెల్తీగా ఉంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శరీర బరువును తగ్గించడానికి, కొవ్వును కరిగించడానికి బ్రోకెన్ వీట్ లేదా సూజీ గోధుమ బాగా సహాయపడుతుంది. మీరు దీన్ని అన్నానికి బదులుగా తినొచ్చు. ఇది టేస్టీగా కూడా ఉంటుంది.
వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ ను తినండి. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కడుపును తొందరగా నింపి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.
బార్లీ కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉన్న బార్లీ మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది.కాబట్టి దీన్ని మీరు అన్నానికి బదులుగా తినొచ్చు.
ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మీరు గనుక ఓట్స్ ను మధ్యాహ్నం తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఇది మీరు అతిగా తినకుండా చేస్తుంది.
ఉప్మాను చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఉప్మాలో కొవ్వు తక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం అన్నానికి బదులు దీన్ని తింటే బరువు తగ్గుతారు.