Food
ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు మాత్రమే కాదు. చక్కెర ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోడా, కూల్ డ్రింక్స్ వంటి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇవి కూడా కిడ్నీ స్టోన్స్ కు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.
చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ తో పాటు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్నా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కిడ్నీలో సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.
మోతాదుకు మించి కాఫీ తీసుకోవడం కిడ్నీల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంది.
పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.