అరటిపండులో కేలరీలే కాదు షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు వీటిని తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. కానీ వెంటనే కాదు.
Image credits: Getty
అరటిపండు వెంటనే షుగర్ ను ఎందుకు పెంచదు?
అరటి పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. అందుకే వీటిని తిన్నా వెంటనే షుగర్ పెరగదు.
Image credits: Getty
షుగర్ వ్యాధిగ్రస్తులు అరటి తినొచ్చా?
ఏదేమైనా డయాబెటీస్ పేషెంట్లు అరటిపండును డాక్టర్ సలహా తీసుకుని లిమిట్ లో తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అన్నానికి బదులుగా లేదా మధ్యలో కొంచెం పండిన పండును తినొచ్చు.
Image credits: Getty
బరువు తగ్గడానికి అరటిపండు మంచిదా?
అరటిపండు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే వ్యాయామం చేసిన తర్వాత శక్తిని ఇస్తుంది.
Image credits: Getty
అరటిపండు ప్రయోజనాలు
అరటిపండును తింటే హైబీపీ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడతాయి. అలాగే అరటిపండు చర్మ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.