Food

జస్ట్ 10నిమిషాల్లో ఎగ్ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..

10 నిమిషాల్లో ఎగ్ ఫ్రై

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఖచ్చితంగా గుడ్డు తినాలి. మీరు ఈ పద్దతిలో గనుక ఎగ్ ఫ్రై చేస్తే టేస్ట్ కు టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఎగ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం..

ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు

  • 6-7 ఉడికించిన గుడ్లు
  • అరకప్పు నూనె
  • 2 ఉల్లిపాయలు
  • 4-5 పచ్చిమిర్చి
  • కొన్ని కరివేపాకు రెబ్బలు
  • అర టేబుల్ స్పూన్ కారం
  • అర టేబుల్ స్పూన్ పసుపు, ధనియాలు, జీలకర్ర

ఎగ్ ఫ్రై

  • మిరియాల పొడి
  • గరం మసాలా
  • కొత్తిమీర
  • రుచికి సరిపడా ఉప్పు

ముందుగా పాన్ వేడిచేసి నూనెలో గుడ్లను అన్ని వైపులా వేయించండి. లేత బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి.

తవా ఎగ్ ఫ్రై రెసిపీ

ఈ పాన్‌లోనే మిగిలిన నూనెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం అన్ని మసాలా దినుసులను వేసి కలపండి. 

సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీ

 దీంట్లో కొన్ని నీళ్లను పోయండి. దీనివల్ల మసాలా దినుసులు పాన్ కు అంటుకోకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయను 2-3 నిమిషాలు వేయించి ఆ తర్వాత కొద్దిగా నూనె వేసి గుడ్లు వేయండి.

సింపుల్ ఎగ్ రెసిపీ

ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్లు పోసి రెండు మూడు నిమిషాలు ఉడికించండి.ఆ తర్వాత గుడ్లకు మసాలా మొత్తం పట్టేలా కలుపుతూ ఉండండి.

రోటీ-అన్నంలో తినండి

టేస్టీ టేస్టీ తవా ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెడీ. దీన్ని చేయడానికి పెద్దగా ఇబ్బంది అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ ఫ్రై చేయొచ్చు. దీన్ని డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు. 

బిర్యానీ ఆకు ఇందుకు కూడా ఉపయోగపడుతుందని తెలుసా.?

తాటి బెల్లం తింటే.. ఆ సమస్యలన్నీ బలదూర్‌

నల్ల నువ్వులు, నల్ల బియ్యం, నల్ల ఆవాలను తింటే ఏమౌతుందో తెలుసా

రాత్రి ఈ పండ్లను తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే