Food

Chanakya niti: వెజ్ మంచిదా? నాన్ వెజ్ మంచిదా?

చాణక్య నీతి

చాణక్య నీతి ప్రకారం శాఖాహారం తింటే ఎక్కువ శక్తి లభిస్తుందా? మాంసాహారం తింటే ఎక్కువ శక్తి లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాణక్య నీతి

చాణక్య నీతి ప్రకారం.. మన శరీరానికి పిండి పదార్థాలు, ధాన్యాలు ఎంతో మంచివి. అయితే ఈ ధాన్యాల కన్నా పాలు మంచివి. ఈ పాల కన్నా మాంసం, మాంసం కన్నా నెయ్యి మనకు ఎక్కువ శక్తినిస్తుంది. 

ధాన్యాలు, పిండిలో శక్తి

చాణక్య నీతి ప్రకారం.. ధాన్యాలు మనకు చాలా శక్తినిస్తాయి. అందుకే వీటిని తినాలని చెప్తారు. అయితే ఈ ధాన్యాల కన్నా పిండిపదార్థాలు మనకు పదిరెట్లు ఎక్కువ బలాన్నిస్తాయి.

పాలలో ఎక్కువ శక్తి

ఆచార్య చాణక్యుడి ప్రకారం..ధాన్యాల్లో కంటే పాలలోనే శక్తి ఎక్కువగా ఉంటుంది. బర్రె పాల కంటే ఆవుపాలే మంచివి. ఎందుకంటే ఇవి తేలికగా జీర్ణమవుతాయి. 

మాంసంతో ఎక్కువ బలం

చాణక్య నీతి ప్రకారం.. పాలలో కంటే మాంసాహారంతోనే మనకు ఎనిమిది రెట్లు ఎక్కువ బలం లభిస్తుంది. కానీ ఎలాంటి కారణం లేకుండా జీవహింస చేయడం మహాపాపం. అందుకే మాంసాహారం తినకూడదంటారు.

నెయ్యితో ఎక్కువ బలం

చాణక్య నీతి ప్రకారం.. నాన్ వెజ్ లో కంటే పదిరెట్లు ఎక్కువ శక్తి ఆవు నెయ్యితోనే అందుతుంది. ఎందుకంటే నెయ్యిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇది మనల్ని బలంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. 

మిరియాలు రోజూ తింటే ఏమౌతుంది?

ఓట్స్ ఎలా తింటే బరువు తగ్గుతారో తెలుసా?

సొరకాయ తినడానికి ఇష్టపడడం లేదా? ఇవి కోల్పోతున్నట్లే..

ముకేష్ అంబానీ ఫేవరేట్ ఫుడ్.. ధర ఇంత చీపా?