Telugu

ఇంట్లో బ్రెడ్ ఉందా?

ఇంట్లో బ్రెడ్ ఉందా? అయితే సాయంత్రం పూట తినడానికి ఓ సులభమైన స్నాక్ రెసిపీని ఇప్పుడు చూద్దాం. దీన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

Telugu

బ్రెడ్ - 2 స్లైసులు

ఈ స్వీట్ బ్రెడ్ టోస్ట్ రెసిపీ కోసం ముందుగా రెండు బ్రెడ్ స్లైసులు తీసుకోండి.

Image credits: Getty
Telugu

నెయ్యి

ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అవసరం అవుతుంది. ఇది టోస్ట్‌కు మంచి రుచిని ఇస్తుంది.

Image credits: Getty
Telugu

పంచదార

మీరు తినే తీపిని బట్టి, రుచికి సరిపడా పంచదార తీసుకోండి.

Image credits: Getty
Telugu

పాలు

ఈ స్నాక్ తయారీకి ఒక కప్పు కాచిన పాలు అవసరం.

Image credits: Getty
Telugu

పాల పొడి

ఒక స్పూన్ పాల పొడి కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇది మిశ్రమానికి చిక్కదనాన్ని ఇస్తుంది.

Image credits: Getty
Telugu

ఖర్జూరాలు

ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్, తీపి ఇచ్చేందుకు రెండు ఖర్జూరాలు తీసుకోండి.

Image credits: Getty
Telugu

దాల్చిన చెక్క పొడి

ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా అవసరం. ఇది మంచి సువాసన ఇస్తుంది.

Image credits: Getty
Telugu

అంచులు కట్ చేసి, నెయ్యి రాయాలి

ముందుగా బ్రెడ్ స్లైసులు తీసుకుని, వాటి అంచులు కట్ చేయాలి. తర్వాత బ్రెడ్ మీద నెయ్యి రాసి, కొద్దిగా పంచదార చల్లాలి.

Image credits: Getty
Telugu

పాల పొడి వేసి కలపాలి

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి బ్రెడ్‌ను రెండు వైపులా కాల్చాలి. మరో గిన్నెలో ముప్పావు కప్పు పాలు పోసి, అర టేబుల్ స్పూన్ పాల పొడి వేసి బాగా కలపాలి.

Image credits: Getty
Telugu

ఖర్జూరాలను పాలతో కలిపి పేస్ట్ చేయాలి

గింజలు తీసిన 5 ఖర్జూరాల్లోకి పావు కప్పు పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్‌పై ఉన్న పాలు చిక్కబడుతున్నప్పుడు, ఈ ఖర్జూరం పేస్ట్‌ను వేసి బాగా కలిపి, దగ్గరపడే వరకు ఉడికించాలి.

Image credits: Getty
Telugu

దాల్చిన చెక్క పొడి వేసి సర్వ్ చేయాలి

ఇందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి కూడా వేసి కలపాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసుల మీద ఈ మిశ్రమాన్ని వేసి వేడివేడిగా సర్వ్ చేస్తే సరిపోతుంది.

Image credits: Getty

Buttermilk: మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ తాగితే ఏమౌతుంది?

Egg: రోజుకి ఒక కోడిగుడ్డు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

Paneer: మీకు పనీర్ అంటే పిచ్చా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Mango: అప్పుడే కొనేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలియకపోతే మోసపోయినట్లే