Telugu

మామిడి పండు నాణ్యతను పరీక్షించే 5 మార్గాలు

వేసవి అంటేనే మామిడిపండు సీజన్. ఎక్కడ కనిపిస్తే అక్కడ కొనేస్తాం. ఎంత రేటైనా చెల్లిస్తాం. ఇదే అదునుతో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తారు జాగ్రత్త. 

Telugu

ఇంట్లోనే ఈ 5 పరీక్షలు

మార్కెట్లో దొరికే మామిడి పండ్లు సహజంగా పండినవా లేదా కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్‍తో పండించినవా అని తెలుసుకోవాలి. మీ ఆరోగ్యం కోసం ఇంట్లోనే ఈ 5 పరీక్షలు చేసుకోండి.

Image credits: Getty
Telugu

నీటి పరీక్ష

ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకుని అందులో మామిడి పండ్లను వేయండి. పండ్లు నీటి అడుగుకు వెళ్తే అవి సహజంగా పండినట్లు. ఒకవేళ అవి పైకి తేలితే వాటిని కెమికల్‍తో పండించారని గుర్తించాలి.

Image credits: Getty
Telugu

నొక్కి చూడండి

పండును నొక్కినప్పుడు మెత్తగా ఉండి, మళ్లీ పాత స్థితికి వస్తుంది. బయటకు పసుపు రంగులో కనిపించి, నొక్కినప్పుడు కొన్ని చోట్ల గట్టిగా ఉంటుంది. అంటే ఇంకా పక్వానికి రాలేదని అర్థం. 

Image credits: Getty
Telugu

రంగును బట్టి కూడా మనం గుర్తుపట్టవచ్చు.

పండు మొత్తం ఒకే రంగులో ఉండదు. అక్కడక్కడా పసుపు, పచ్చ రంగులు కలిసి ఉంటాయి. పండు అంతా ఎక్కడా మచ్చ కూడా లేకుండా పసుపు రంగులో ఉంటే అనుమానించాల్సిందే.

Image credits: Getty
Telugu

వాసన చూడండి

మామిడి పండు వాసన ఇట్టే పట్టించేస్తుంది. తొడిమ దగ్గర వాసన చూస్తే తియ్యటి, ఘాటైన సువాసన వస్తుంది. కెమికల్‍తో పండిస్తే అసలు వాసన ఉండదు. లేకపోతే ఒక రకమైన ఘాటైన కెమికల్ వాసన వస్తుంది. 

Image credits: Getty
Telugu

కోసి చూడండి

పండు కోశాక లోపల రంగు చూడండి. గుజ్జు ముదురు పసుపు లేదా కాషాయంలో ఉండి, రసంతో నిండి ఉంటుంది. బయట పసుపుగా ఉన్నా, గుజ్జు తెల్లగా లేదా లేత పసుపులో ఉంటే అది రసాయనాలతో పండించినట్లే. 

Image credits: Getty
Telugu

ఇలా సురక్షితం

పండ్లను తినే ముందు కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి, బాగా కడిగి తినడం సురక్షితం.

Image credits: Getty

Kitchen Tips: వేపుళ్లు క్రిస్పీగా రావాలంటే.. ఇదొక్కటి కలిపితే చాలు

Protein Foods: గుడ్డును మించి ప్రోటీన్ ఇచ్చే 7 వెజ్ వెరైటీస్ ఇవే!

Cardamom Water: పరగడుపున యాలకుల నీరు తాగితే ఏమౌతుంది?

ఏడాదంతా నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో తెలుసా?