Food
ఆకు కూరలు అధిక రక్తపోటును కంట్రోల్ చేయానికి బాగా సహాయపడతాయి. మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్న ఆకు కూరలను తింటే బీపీ నార్మల్ అవుతుంది.
అరటిపండును తింటే మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు.. మీ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఒక మీడియం సైజు అరటిపండులో 422 మి.గ్రా. పొటాషియం ఉంటుంది.ఇది బీపీని తగ్గిస్తుంది.
చాలా మంది చిలగడదుంపలను చాలా ఇష్టంగా తింటుంటారు. మీకు తెలుసా? దీనిలో ఉండే పొటాషియం మీ బీపీని కంట్రోల్ చేసి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
దానిమ్మ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో కూడా పొటాషియం మెండుతా ఉంటుంది. ఇది కూడా బీపీని నియంత్రించడానికి సహాయపడుతుంది.
నారింజ పండును తిన్నా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఒక మీడియం సైజు నారింజ పండులో 250 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది మీ బీపీని తగ్గిస్తుంది.
అవకాడోలో కూడా పుష్కలంగా పొటాషియం ఉంటుంది. అంటే మీరు ఈ పండును తిన్నా బీపీ తగ్గి మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది.