Food
వాల్నట్స్ లో మెలటోనిన్ అనే రసాయం పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది.
వాల్నట్స్ తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీని వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వాల్నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ప్రతిరోజూ వాల్నట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
వాల్నట్స్‌లో విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
వాల్నట్స్‌లో ఉండే విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే వాల్నట్స్ తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని నియంత్రించవచ్చు.
నానబెట్టిన వాల్నట్స్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.