ఓట్స్ తింటే శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
బీపీని నియంత్రించడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఓట్స్ లో పుష్కలంగా ఉంటాయి.
ఓట్స్‌లో కరిగే ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది మీరు తిన్నదాన్ని త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
100 గ్రాముల ఓట్స్‌లో 16.9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే మీ శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
ఓట్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులకు మిమ్మల్ని దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.
ఓట్స్‌లో ఉండే సపోనిన్లు చర్మాన్ని సహజంగా శుభ్రపరుస్తాయి. దీంతో మీ చర్మం స్మూత్ గా, మంచి గ్లో వస్తుంది.
ఓట్స్ లో కరిగే ఫైబర్ మెండుగా ఉంటుంది. కాబట్టి ఇది పొట్టకు పేరుకుపోయిన కొవ్వును సులువుగా తగ్గిస్తుంది.
పాలతో ఈ పండ్లు అస్సలు కలపకూడదు
Beauty Tips: 40 వయసులోనూ 20 లా కనిపించాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!
Hair Fall Control Tips: జుట్టు రాలడాన్ని తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
రోజూ గుడ్డు తింటే ఒంట్లో కొలిస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా?