Food

పెసరుపప్పు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా..!!

పోషకాలతో నిండిన పెసరుపప్పు

1 కప్పు పెసరుపప్పులో ఇనుము, జింక్, విటమిన్ B2, B3, B5, భాస్వరం వుంటాయి. 

  1.  

ఫైబర్ తో నిండిన పెసరుపప్పు

పెసరుపప్పులో తగినంత ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. 202 గ్రాముల పప్పులో  15.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

పెసరుపప్పులో పోషకాలు

  1. కేలరీలు: 212
  2. కొవ్వు: 0.8 గ్రాములు
  3. ప్రోటీన్: 14.2 గ్రాములు
  4. పిండి పదార్థాలు: 38.7 గ్రాములు
  5. ఫైబర్: 15.4 గ్రాములు

గట్ హెల్త్ ని బలోపేతం చేస్తుంది

ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో ప్రేగులలో కనిపించే గట్ బాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది.  పెసరుపప్పులో రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన బాక్టీరియాకు పోషణను అందిస్తుంది. 

గర్భధారణలో ప్రయోజనకరం

పెసరుపప్పులో తగినంత ఫోలేట్ ఉంటుంది, ఇది పిండం పెరుగుదలకు అవసరం. అలాగే ఈ పప్పులో ఉండే ఇనుము, ప్రోటీన్, ఫైబర్ స్త్రీలలో బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడంలో

పెసరుపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. తద్వారా తక్కువ ఆహారం తీసుకుని బరువు తగ్గవచ్చు. 

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

పెసరుపప్పులో ప్రోటీన్ తో పాటు యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Find Next One