Food
ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గిస్తే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
చక్కెరను ఎక్కువగా తీసుకుంటే కూడా మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
సోడా వంటి చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను తాగితే కూాడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. వీటిని తగ్గిస్తే కిడ్నీ స్టోన్స్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.
సీ ఫుడ్, రెడ్ మీట్ వంటివి ఎక్కువగా తింటే కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీటిని తగ్గించాలి.
కాఫీలో ఉండే కెఫీన్ కంటెంట్ ను ఎక్కువగా తీసుకోవడం మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి కిడ్నీ స్టోన్స్ కు దారితీస్తాయి.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు మాత్రమే మీ రోజూ వారి ఆహారంలో మార్పులు చేయండి.