Telugu

Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..

Telugu

పిల్లలకు గొప్ప వరం

పిల్లల ఆరోగ్యానికి పాలు గొప్ప వరం. ఇక అరటిపండు బలాన్నిస్తుంది. కాల్షియంతో పాటు ఫైబర్ అందుతుంది. అందుకే రెండూ కలిపి ఇస్తే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. రోజంతా యాక్టివ్‍గా ఉంటారు.

Image credits: Getty
Telugu

స్ట్రాంగ్‍గా తయారవుతారు

అందుకే పాలలో ఉండే కాల్షియం, బనానాలో ఉండే పొటాషియం, మెగ్నీషియం శరీరంలోని మినరల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఎదిగేకొద్దీ ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

కండరాలు బలంగా ఉంటాయి

పాలలో ఉండే ప్రోటీన్ పిల్లల కండరాల పెరుగుదలకు, కణాల బలానికి పనికొస్తాయి. అరటిపండులోని పొటాషియం కండరాల్లో నొప్పులను నివారించి, వారిని చురుకుగా ఉంచుతుంది.

Image credits: Getty
Telugu

రోజంతా శక్తినిస్తుంది

అరటిపండులోని సహజ చక్కెరలు, పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు పిల్లలకు తక్షణ శక్తిని అందిస్తాయి. పిల్లలు నీరసించిపోకుండా ఉండేందుకు ఇది ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

జీర్ణం సరిగ్గా జరుగుతుంది

అరటిపండులో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని పాలతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణక్రియ సాఫీగా జరిగి, మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.
Image credits: our own
Telugu

మెదడు చురుకుగా ఉంటుంది

పాలలో ఉండే బి-విటమిన్లు, అరటిపండులోని విటమిన్ బి6 పిల్లల మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

మంచి నిద్ర పడుతుంది

పాలలో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. అరటిపండులోని పోషకాలు కూడా నరాలను శాంతపరచి, రాత్రిపూట పిల్లలకు ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి.
Image credits: Getty

Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?

Natu Kodi Curry: నాటుకోడి వండినప్పుడు ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది, రుచి కూడా డబుల్

Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?

Sweet potato: రోజుకి ఒక చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా?