Telugu

ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఇదే!

Telugu

అత్యంత తియ్యటి మామిడిపండు

ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఏదని అడిగితే, వెంటనే చెప్పాల్సిన పేరు 'కారబావో'. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ పండు అత్యంత మధురమైన మామిడి పండుగా ప్రసిద్ధి చెందింది.

Image credits: Getty
Telugu

వరల్డ్ రికార్డ్..

దీని అసాధారణమైన తీపి కారణంగా ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడి పండు రకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

Image credits: Getty
Telugu

అధిక బ్రిక్స్ లెవల్

పండ్లలో చక్కెర శాతాన్ని కొలిచే 'బ్రిక్స్ లెవల్'.. ఈ కారబావో మామిడి పండ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికింత తియ్యదనం.

Image credits: Getty
Telugu

రుచిలో చాలా స్పెషల్

ఇతర మామిడి పండ్లలాగా పులుపు, తీపి కలగలిసిన రుచి దీనికి ఉండదు. మిఠాయితో పోల్చదగిన స్వచ్ఛమైన తీపి మాత్రమే దీని సొంతం.

Image credits: Getty
Telugu

వెన్నలాంటి గుజ్జు

మెరిసే బంగారు రంగులో ఉండే దీని గుజ్జులో అస్సలు పీచు ఉండదు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ఘుమఘుమలాడే సువాసన కూడా ఉంది. ఆ వాసనకే తినాలనే కోరిక పుడుతుంది.

Image credits: Getty
Telugu

మామిడి ప్రియుల ఫేవరెట్

అధిక చక్కెర శాతం, ప్రత్యేకమైన సువాసన, చూడచక్కని రూపం.. ఈ కారణాల వల్ల కారబావో మామిడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మామిడి ప్రియుల ఫేవరెట్ రకంగా నిలిచింది.

Image credits: Getty

Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..

Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?

Natu Kodi Curry: నాటుకోడి వండినప్పుడు ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది, రుచి కూడా డబుల్

Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?