Monsoon Diet: వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు.. తిన్నారంటే ?
food-life Jun 23 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
ఆకుకూరలకు దూరం
వర్షాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉండటమే బెటర్. ఎందుకంటే ఈ సీజన్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల క్యాబేజీ, ఆకుకూరలు, పాలకూర వంటి ఆకుకూరల్లో బ్యాక్టీరియా, పరాన్నజీవులు పెరుగుతాయి.
Image credits: Freepik
Telugu
మామిడి పండ్లు
వర్షాకాలంలో మామిడి పండ్లు త్వరగా పాడైపోతాయి. బూజు పట్టే అవకాశం ఉంది. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి, అలెర్జీలు రావచ్చు. వర్షాకాలంలో మామిడి పండ్లకు దూరంగా ఉండండి.
Image credits: Freepik
Telugu
క్యాప్సికమ్
వర్షాకాలంలో క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్ లకు దూరంగా ఉండండి. వీటిని తినడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Freepik
Telugu
పాల ఉత్పత్తులు
పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులను వీలైతే ఇంట్లో చేసుకోండి. మార్కెట్లో కొన్నిచోట్ల అంత శుభ్రంగా తయారు చేయరు. వాటిని వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇవి ఆరోగ్యానికి హానికరం.
Image credits: Google
Telugu
స్ట్రీట్ ఫుడ్స్
స్ట్రీట్ ఫుడ్ ఎంత రుచిగా ఉన్నా ఆరోగ్యానికి హానికరం. సీజన్ ఏదైనా సరే స్ట్రీట్ ఫుడ్ తినొద్దు. ముఖ్యంగా వర్షాకాలంలో దూరంగా ఉండాలి. స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల వ్యాధుల ప్రమాదం ఎక్కువ.