Kitchen Tips: పండ్లు, కూరగాయలు.. ఇలా స్టోర్ చేస్తే నెలల పాటు తాజాగా..
Telugu
కొత్తిమీర
తేమలేకుండా కొత్తిమీరను తీసుకుని దానికాడలను కత్తిరించండి. పాడైన ఆకులను తీసేసి, ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసి, దానిపై కొత్తిమీరను ఉంచండి. కొన్ని రోజులపాటు తాజాగా ఉంటుంది.
Telugu
అరటిపండ్లు
చాలా మంది ఫేవరెట్ ఫ్రూట్స్ అరటిపండ్లు. అందరికీ అందుబాటులో ఉంటాయి. అలాంటి అరటిపండ్ల కాడలకు కాగితం చుట్టి, ఒక డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇలా చేస్తే తాజాగా ఉంటాయి.
Telugu
అల్లం
అల్లంను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయండి. ఆ తరువాత గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రీజ్‌లో ఉంచండి. ఇలా చేస్తే.. నెలల తరుబడి తాజాగా ఉంటుంది.
Telugu
పొట్లకాయ
పొట్లకాయ ముక్కలుగా కోసి, క్లింగ్ ఫిల్మ్‌తో చుట్టి, గాలి చొరబడని డబ్బాలో ఉంచండి.
Telugu
బీన్స్
బీన్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. ముందుగా వాటిని శుభ్రంగా కడగాలి. చివరలను కత్తిరించి, తేమ లేకుండా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేసి ఫ్రీజర్‌లో పెడితే.. నెల వరకు తాజాగా ఉంటాయి.
Telugu
టమాటాలు
టమోటాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. పసుపు, ఉప్పు, వెనిగర్ కలిపిన నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, ఆపై శుభ్రం చేసి, గాలి చొరబడని డబ్బాలో పెడితే టమోటాలను ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
Telugu
పచ్చిమిర్చి
పచ్చిమిర్చిని బాగా శ్రుభం చేసి, వాటి కాడలు తీసేవేయండి. ఆ తరువాత వాటిని తేమ లేకుండా టిష్యూ పేపర్‌లో చుట్టి డబ్బాలో ఉంచండి. ఇలా చేస్తే నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి.