Telugu

Watermelon: ఖాళీ కడుపుతో కర్భూజ తింటే.. ఇన్ని ప్రయోజనాలా?

Telugu

మెరుగైన జీర్ణక్రియ

90% నీరు, ఫైబర్ ఉన్న కర్బూజ పండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

కంటి సమస్యలకు పరిష్కారం

కర్బూజలో  విటమిన్ ఎ బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కంటి చూపును మెరుగుపర్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే.. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి

కర్బూజాలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లుగా ఉంచుతుంది, తద్వారా మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

గుండె పదిలం

కర్బూజను తింటే గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

Image credits: Getty
Telugu

కండరాల ఆరోగ్యం

కర్బూజా కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కర్బూజాలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదల, మరమ్మత్తుకు తోడ్పడతాయి.

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కర్బూజా తినడం మంచిది. కర్బూజాలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

లైంగిక సమస్యల చెక్

కర్బూజలో విటమిన్ K, E లు పుష్కలంగా ఉంటాయి. దీని వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీనిని తినడం వల్ల లైంగిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  

Image credits: Getty

Health Tips: రోజుకో గుడ్డు తింటే ఇన్ని లాభాలా?

Dates: నానబెట్టిన ఖర్జూరం రోజూ తింటే కలిగే లాభాలేంటో తెలుసా?

Kitchen Tips: పండ్లు, కూరగాయలు.. ఇలా స్టోర్​ చేస్తే నెలల పాటు తాజాగా..

పండ్లు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే..ఈ సూపర్ టిప్స్ ఫాలోకండి!