వర్షాకాలంలో పాలకూర ఆకులపై తేమ, మురికి పేరుకుపోతుంది. దీంతో వాటిపై బ్యాక్టీరియా, కీటకాలు వృద్ధి చెందుతాయి. వీటిని తింటే ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.
మెంతి
తేమ వల్ల మెంతికూర త్వరగా పాడవుతుంది. అంతేకాకుండా ఈ కాలంలో వాటిపై ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. ఒకవేళ మీరు దీన్ని తిన్నారంటే గ్యాస్, వాంతులు, అజీర్ణం సమస్యలు వస్తాయి.
Mustard Greens
Mustard Greens ను కూడా తేమ వల్ల తొందరగా పాడవుతుంది. అలాగే ఈ ఆకులపై కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే వాంతులు, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
లెట్యూస్
లెట్యూస్ ఆకులను కూడా వర్షాకాలంలో తినకూడదు. వీటిపై బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. వీటిని తింటే డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి.
జాగ్రత్తలు..
వర్షాకాలంలో మీరు ఏ కూరగాయలను తెచ్చినా వాటిని బాగా శుభ్రం చేసిన తర్వాతే తినాలి. అలాగే పచ్చిగా అస్సలు తినకూడదు. బాగా వండి తింటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.