Food

రాత్రి చేసిన చపాతీలను ఉదయం తింటే ఏమౌతుందో తెలుసా?

Image credits: Freepik

పోషకాలు

అప్పుడే చేసిన చపాతీలో కంటే.. రాత్రిచేసిన లేదా ఉదయం చేసిన మిగిలిపోయిన చపాతీలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బ్లడ్ షుగర్

మిగిలిపోయిన చపాతీలో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రాత్రి చేసిన చపాతీని పెరుగుతో తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. 

జీర్ణక్రియ

పాత చపాతీలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియకు సహాయపడతాయి. దీన్ని తింటే పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఫుడ్ బాగా జీర్ణమవుతుంది. 

శరీరంలో శక్తి

మీకు తెలుసా? మిగిలిపోయిన చపాతీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. 

గుండె ఆరోగ్యం

మిగిలిపోయిన చపాతీని మీరు పెరుగుతో గనుక తింటే దానిలో ఉండే ప్రోబయోటిక్‌లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

బరువు తగ్గడానికి

అవును మిగిలిపోయిన చపాతీని తింటే మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఈ చపాతీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

గ్యాస్ తగ్గడానికి

మిగిలిన చపాతీని మీరు పాలు లేదా పెరుగుతో తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఇది కడుపును చల్లగా ఉంచుతుంది. 

వర్షాకాలంలో ఈ పండ్లు తింటున్నారా, జర జాగ్రత్త

8 సౌతిండియా బిర్యానీలు / వీటిలో ఎన్ని ట్రై చేశారు

మధ్యాహ్నం ఇవి తిన్నారంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడం పక్కా

తేనె స్వచ్ఛమైనదో, కల్తీనో తెలుసుకోవడానికి 5 చిట్కాలు