Food
పరిగడుపున అరటిపండ్లను తింటే శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. దీనిలో ఉండే నేచురల్ షుగర్ బాడీకి స్టామినాను అందిస్తుంది.
అరటి పండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటుని అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బీపీ పేషెంట్లు పరిగడుపున అరటిపండ్లను తినాలని చెప్తారు.
ప్రతిరోజూ పరిగడుపున అరటిపండ్లను తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
అయితే పరిగడుపున అరటిపండును తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పరిగడుపున అరటిపండును తింటే జీర్ణ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని పరిగడుపున తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఆరోగ్య నిపుణులు ప్రకారం.. అరటిపండును పరిగడుపున కాకుండా ఏదైనా తిన్న తర్వాత తినడం మంచిది.