Food
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. దీనికి కారణం గడ్డులో ఉండే కొవ్వు పదార్థాలే. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది.?
మితంగా గుడ్లు తినడం (వారానికి 1-6 సార్లు) గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కోడిగుడ్డు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దాన్నిపై పరిశోధనలు నిర్వహించారు.
మితంగా గుడ్లు తినడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి.
గుడ్లు తినేవారిలో గుండె జబ్బులతో మరణాలు వచ్చే అవకాశాన్ని 29 శాతం తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 70 ఏళ్లు పైబడిన 8,756 మందిని పరిగణలోకి తీసుకుని అధ్యయనం నిర్వహించారు.
గుడ్లు ఒమేగా-3, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇక గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను రకించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.