Food
అంజీర పండ్లు డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
అంజీర పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ మరీ ఎక్కువగా ఉండదు. కాబట్టి దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్ గా పెరగవు.
అత్తిపండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్ పేషెంట్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి.
అంజీర పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అతిగా తినకుండా చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అంజీర పండ్లలో ప్యాంక్రియాస్ లోని బీటా కణాలను రక్షించే గుణం ఉంటుంద. అందుకే ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిని సులువుగా నియంత్రిస్తుంది.
అంజీర పండ్లలో డయాబెటీస్ పేషెంట్ల ఇమ్యూనిటీ పవర్ నుం పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను తింటే డయాబెటీస్ పేషెంట్లు సులువుగా అనారోగ్యానికి గురికారు.
షుగర్ ఉన్నవారు అంజీర పండ్లను రాత్రిమొత్తం గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ వాటర్ ను తాగాలి. దీంతో మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
మధుమేహం ఉన్నవారు రోజుకు రెండు అంజీర పండ్లను మాత్రమే తినాలి. ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.