ఉల్లిపాయ, బంగాళదుంప రెండింటినీ కలిపి నిల్వ చేయకూడదు. రెండింటినీ వేర్వేరు బుట్టల్లో ఉంచాలి. దీని వల్ల కుళ్లిపోకుండా ఉంటాయి.
కాగితంలో చుట్టాలి..
మీ ఉల్లిపాయలు తేమగా ఉండి, అవి కుళ్ళిపోకుండా ఉండాలంటే, ఒక్కొక్క ఉల్లిపాయను వార్తాపత్రికలో చుట్టి బుట్టలో ఉంచండి.
వలలున్న సంచులను వాడండి
ప్లాస్టిక్ సంచులకు బదులుగా వలలున్న సంచులు లేదా కాగితపు సంచులను ఉపయోగించండి. దీని వలన గాలి ప్రసరణ ఉంటుంది, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పాడవకుండా ఉంటాయి.
బంగాళాదుంపల మధ్య ఆపిల్ ఉంచండి
బంగాళాదుంపలు మొలకెత్తకుండా ఉండాలంటే, బంగాళాదుంపల బుట్ట మధ్యలో ఒక ఆపిల్ ఉంచండి. దీని వలన అవి మొలకెత్తవు.
ఉల్లిపాయల తొక్క తీయవద్దు
ఉల్లిపాయలను తొక్క తీయకుండా నిల్వ చేయండి, ఎందుకంటే తొక్క వాటిని పాడవకుండా కాపాడుతుంది. బంగాళాదుంపలు మొలకెత్తకుండా ఉండాలంటే వాటిని చల్లని ప్రదేశంలో ఉంచండి.
కుళ్ళిన ఉల్లి, బంగాళాదుంపలను వేరు చేయండి
ఎప్పటికప్పుడు నిల్వను తనిఖీ చేయండి. ఏదైనా ఉల్లిపాయ లేదా బంగాళాదుంప కుళ్ళిపోతే, దానిని వెంటనే తీసివేయండి. లేకపోతే మిగిలినవి కూడా కుళ్ళిపోతాయి.