Food
మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి అరటి పండు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి, మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది.
అరటిపండులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని కాపాడుతాయి.
అరటి పండులో విటమిన్ బి6 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన కాలెయం,మూత్రపిండాల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది.
అరటిపండులోనే కాదు దాని తొక్కలో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు అరటిపండును మార్నింగ్ లేదా మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం చేసిన తర్వాత తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ మీకు అరటిపండును అలాగే తినడం ఇష్టం లేకపోతే గనుక దానితో మిల్క్ షేక్ చేసి తాగండి.