కరివేపాకును శుభ్రం చేయకుండా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే మురికిగా ఉన్న కరివేపాకు తొందరగా పాడవుతుంది.
నీళ్లతో కడిగిన కరివేపాకును అలాగే ఫ్రిజ్ లో పెట్టకుండా పూర్తిగా ఆరబెట్టాలి. తేమ ఉంటే కరివేపాకు పాడవుతుంది.
కరివేపాకును కవర్ లో చుట్టి గాలి వెళ్లని డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి. అయితే పాడైన ఆకులను మర్చిపోకుండా తీసేయాలి.
మీరు గనుక కరివేపాకును ఫ్రీజర్ లో నిల్వ చేయాలనుకుంటే జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టాలి. అవసరమైనప్పుడు తీసి వాడొచ్చు.
కావాలనుకుంటే మీరు కరివేపాకును ఎండబెట్టి కూడా నిల్వ చేయొచ్చు. ఇందుకోసం కరివేపాకును శుభ్రంగా కడిగి ఎండబెట్టి తేమ లేని డబ్బాలో నిల్వ చేయాలి.
కరివేపాకును మూడు రోజులు ఎండలో పెడితే తేమ లేకుండా పూర్తిగా ఎండుతుంది.
బాగా ఎండిన కరివేపాకును మీరు గాలి వెళ్లని డబ్బా లేదా జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టొచ్చు.
చపాతీ, పూరీ, దోశ లకు ఈ రెడ్ చట్నీ బాగుంటుంది
బనానాకు బదులు ఈ పండ్లను తిన్నా హెల్తీగా ఉంటారు
కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి తగ్గుతుంది
చేపల కూరను ఇలా మాత్రం తినకండి