నిజమైన , నకిలీ తేనెను గుర్తించడానికి నీటి పరీక్ష చేయండి. ఒక గ్లాసు నీటిలో తేనె వేయండి. తేనె నేరుగా గ్లాసు అడుగు భాగానికి చేరితే అది నిజమైనది. కరిగిపోతే అది నకిలీది.
థంబ్ టెస్ట్
మీ బొటనవేలుపై కొద్దిగా తేనె వేయండి. తేనె వ్యాపించడం ప్రారంభిస్తే లేదా చాలా ఎక్కువ ద్రవంగా ఉంటే, అది నకిలీది కావచ్చు. నిజమైన తేనె చిక్కగా ఉంటుంది.వ్యాపించకుండా బొటనవేలుపై ఉంటుంది.
నిప్పుతో పరీక్ష
మీరు ఒక అగ్గిపుల్లను తేనెలో ముంచి దానిని వెలిగించడానికి ప్రయత్నించండి. సులభంగా వెలిగితే, తేనె నిజమైనది. అలా కాకుండా నిప్పు అంటుకోకపోతే తేనె కల్తీ అని అర్థం.
స్ఫటికీకరణ
నిజమైన తేనె కాలక్రమేణా చల్లని వాతావరణంలో స్ఫటికీకరణం చెందుతుంది (చక్కెర లాగా గడ్డకడుతుంది). తేనె ఎక్కువ కాలం ద్రవంగా ఉంటే, అది నకిలీది కావచ్చు.
సువాసన , రుచి
నిజమైన తేనె దానిని తయారు చేసిన పువ్వులు , మొక్కల సువాసనను కలిగి ఉంటుంది. దీని రుచి కూడా సహజంగా ,సమతుల్యంగా ఉంటుంది, అయితే నకిలీ తేనెకు ప్రత్యేకమైన సువాసన ఉండదు.