Food

షుగర్ ఉన్నవారు తప్పక తాగాల్సిన జ్యూస్ లు

షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా తాగాల్సిన కొన్ని పానీయాలు

Image credits: Getty

పానీయాలు

మధుమేహులు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. 

 

Image credits: Getty

నీరు

డయాబెటీస్ పేషెంట్లు నీళ్లను పుష్కలంగా తాగాలి. ఎందుకంటే నీళ్లు షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి.అలాగే మూత్రపిండాలు కూడా బాగా పనిచేస్తాయి.

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీ డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ బ్లడ్ షుగర్ ను తగ్గించడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty

హెర్బల్ టీ

అల్లం, చామంతి, మిరియాలు వంటి హెర్బల్ టీలను కూడా డయాబెటీస్ ఉన్నవారు తాగాలి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

Image credits: Getty

కూరగాయల జ్యూస్

డయాబెటీస్ ఉన్నవారు రకరకాల కూరగాయల జ్యూస్ లను కూడా తాగాలి. ముఖ్యంగా బచ్చలికూర, కాకరకాయ, సెలెరీ వంటి కూరగాయలతో చేసిన జ్యూస్ లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతాయి.

Image credits: Getty

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఇందుకోసం దీన్ని నీటిలో కలిపి తీసుకోవాలి. 

Image credits: Getty
Find Next One