Food
ఒంట్లో కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలు ఇవి..
వేటిని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసా?
పాలు, వెెన్న వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి.
ప్రాసెస్ చేసిన మాంసం నోటికి రుచిగా ఉంటుంది. కానీ వీటిని తింటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో గుండె జబ్బుల రిస్క్ కూడా పెరుగుతుంది.
తీపి పదార్థాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. కానీ డెజర్ట్ లు వంటి తీపి పదార్థాలను మీ బాడీలో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
బంగాళదుంపలను తిన్నా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మీ బరువును పెంచడంతో పాటుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతుంది.
కేకులు, కుకీలు, పేస్ట్రీలను తినే అలవాటు ఉంటే మానుకోండి. ఎందుకంటే ఇవి కూడా మీ శరీరంలో కొవ్వును పెంచుతాయి.
అవును కాఫీ కూడా మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిలో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.