డ్రై ఫ్రూట్స్ లో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పొందడానికి వీటిని ఎన్ని గంటలు నానబెట్టాలో తెలుసా?
బాదం పప్పులను రాత్రంతా లేదా 6 గంటలు నానబెట్టాలి. రోజూ ఐదారు బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే మంచిది.
వాల్ నట్స్ ను రాత్రంతా లేదా 6 గంటలు ఖచ్చితంగా నానబెట్టే తినాలి.
పిస్తాపప్పులను ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలను నానబెట్టిన తర్వాతే తినాలి. అప్పుడే వాటిలోని పూర్తి పోషకాలను పొందుతారు.
చాలా మంది జీడిపప్పులను నానబెట్టకుండా తింటారు. కానీ వీటిని 4 నుంచి 6 గంటలు నానబెట్టిన తర్వాత తింటే రుచిగా ఉంటాయి. పోషకాలు కూడా అందుతాయి.
కిస్ మిస్ లను రెండుమూడు గంటలు నానబెట్టి తింటే వీటిలోని అన్ని పోషకాలు అందుతాయి.
బాదం పప్పులను తొక్కతో తింటే ఇలా అవుతుంది
టమాటాలను ఫ్రిజ్ లో పెట్టకూడదా
Weight Loss: ఇవి తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు
Exercise: వ్యాయామం చేసిన తర్వాత వీటిని మాత్రం తినకండి