Food
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎర్ర అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఎర్ర అరటిపండ్లు హైబీపీ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియంలు బీపీనీ కంట్రోల్ చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
డయాబెటీస్ పేషెంట్లు ఎర్ర అరటిపండ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. షుగర్ ను పెంచవు.
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంటే వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
ఎర్ర అరటిపండ్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
ఎర్ర అరటిపండ్లు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే ఆకలి తగ్గి మీరు హెల్తీగా బరువు తగ్గుతారు.
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.