Food
కొన్ని రకాల పండ్లు మన కండరాలను బలంగా ఉంచుతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచి జబ్బులకు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.
ఇందుకోసం మనం రోజూ తినాల్సిన కొన్ని రకాల పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జామకాయ ఒక సీజనల్ పండు. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనల్ని బలంగా ఉంచడమే కాకుండా.. దీనిలో ఉండే ప్రోటీన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మల్బరీ పండ్లు చూడటానికి చిన్నగా ఉన్నా.. ఇవి ప్రోటీన్ కు మంచి వనరులు. ఈ పండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అవొకాడోను చాలా తక్కువ మందే తింటారు. కానీ ఈ అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి.
అరటిపండ్లు మనకు తక్కువ ధరకే వచ్చినా.. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండులో ప్రోటీన్లు, ఫైబర్, పొటాషియం మెండుగా ఉంటాయి.
పనసపండు చాలా టేస్టీ టేస్టీ గా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే మీరు బలంగా, హెల్తీగా ఉంటారు.